• facebook
  • whatsapp
  • telegram

AP ECET: ఏపీ ఈసెట్‌ దరఖాస్తులో సవరణలకు అవకాశం

కాకినాడ, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా జులై 22న నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీ ఈసెట్‌-2022)కు జూన్‌ 14 వరకు 38,326 మంది దరఖాస్తు చేసుకున్నట్లు జేఎన్‌టీయూ కాకినాడ అడ్మిషన్స్‌ డైరెక్టర్, ఈసెట్‌ కన్వీనర్‌ ఆచార్య అంకాల కృష్ణమోహన్‌ తెలిపారు. జూన్‌ 13తో దరఖాస్తు సమయం ముగిసిందని, 14 నుంచి 16 వరకు దరఖాస్తులోని కేటగిరీ-2లో సవరణలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం apecet2022helpdesk@gmail.com మెయిల్‌కు అభ్యర్థులు వివరాలు పంపించాలన్నారు.రూ.2,000 అపరాధ రుసుంతో జూన్‌ 23 వరకు, రూ.5,000 అపరాధ రుసుంతో జులై 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. సందేహాలుంటే 0884-2340535 నంబరులో సంప్రదించాలని కోరారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 15-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.