• facebook
  • whatsapp
  • telegram

JEE Main Exams: 23 నుంచి జేఈఈ మెయిన్‌ పరీక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ తొలిదశ పరీక్షలను ఈ నెల 23 నుంచి 29 వరకూ దేశవ్యాప్తంగా 501 పట్టణాల్లో నిర్వహించనున్నట్లు ‘జాతీయ పరీక్షల సంస్థ’(ఎన్‌టీఏ) జూన్ 14న‌ ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థికి పరీక్ష కేంద్రం ఏ పట్టణంలో కేటాయించారనే సమాచారాన్ని తెలిపే స్లిప్‌ను జేఈఈమెయిన్‌ అనే వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడు చేసుకోవచ్చని సూచించింది. స్లిప్‌ డౌన్‌లోడ్‌ కాకపోతే 01140759000 నంబర్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చని ఎన్‌టీఏ సూచించింది. పట్టణం పేరు మాత్రమే ఈ స్లిప్‌లో ఉంటుందని, పరీక్ష కేంద్రం ఎక్కడ అనే వివరాలతో అడ్మిట్‌ కార్డు తరవాత జారీచేస్తామని వివరించింది. పరీక్షకు మరో వారం రోజులే గడువు ఉండటంతో అడ్మిట్‌ కార్డు ఇంకా జారీచేయకుండా కేవలం పట్టణం పేరుతో స్లిప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోమనడంపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. చివరిక్షణంలో అడ్మిట్‌కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే సాంకేతిక ఇబ్బందులొచ్చే అవకాశాలున్నాయని వారు వాపోతున్నారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!
ప్రశ్నించే వారికే కార్పొరేట్‌ కొలువులు

ఉన్నత సంస్థల్లో ఉపాధ్యాయ విద్య!

క్లౌడ్‌ నిపుణులకు గిరాకీ!

యూజీలో ప్రవేశానికి సీయూఈటీ

 

.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 15-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.