• facebook
  • whatsapp
  • telegram

AP ECET: ఏపీ ఈసెట్‌కు 38,650 దరఖాస్తులు

కాకినాడ, న్యూస్‌టుడే: కాకినాడ జేఎన్‌టీయూకే ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జులై 22న ఆన్‌లైన్‌లో నిర్వహించే ఏపీ ఈసెట్‌ (ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌)కు జూన్ 24న‌ వరకు 38,650 మంది దరఖాస్తు చేసుకున్నట్లు కన్వీనర్, వర్సిటీ అడ్మిషన్ల డైరెక్టర్‌ ఆచార్య ఎ.కృష్ణమోహన్‌ తెలిపారు. అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటికే సమయం ముగియగా, రూ. 5,000 అపరాధ రుసుంతో జులై 15 వరకు గడువు ఉందన్నారు. పాలిటెక్నిక్, బీఎస్సీ (గణితం) పూర్తిచేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు దీనికి అర్హులని చెప్పారు. పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయన్నారు. ప్రాథమిక కీ జులై 25న విడుదల చేస్తామని, అభ్యంతరాలను 27వరకు స్వీకరిస్తామని పేర్కొన్నారు.  
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.