• facebook
  • whatsapp
  • telegram

Medical Education: స్వదేశంలో వైద్య విద్య పూర్తి చేసే అవకాశం కల్పించాలి

ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన విద్యార్థుల తల్లిదండ్రుల డిమాండ్‌
ఈనాడు, దిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడితో అక్కడి నుంచి తిరిగివచ్చిన తమకు స్వదేశంలో వైద్య విద్య పూర్తి చేసే అవకాశం కల్పించాలని ఎంబీబీఎస్‌ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పేరెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఉక్రెయిన్‌ మెడికల్‌ స్టూడెంట్స్‌(పీఏయూఎంఎస్‌) ఆధ్వర్యంలో జూన్‌ 26న దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిరాహార దీక్ష చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హరియాణా, దిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి వచ్చినవారు పాల్గొన్నారు. ఉక్రెయిన్‌ నుంచి తిరిగివచ్చిన ఎంబీబీఎస్‌ విద్యార్థుల్లో చివరి ఏడాది వారిని మినహాయిస్తే మిగిలినవారు సుమారు 12 వేల మంది ఉన్నారని, దేశంలో మొత్తం 600కు పైగా వైద్య కళాశాలలున్నాయని, ఈ లెక్కన ఒక్కో కాలేజ్‌లో 20 మందికి అడ్మిషన్లు కల్పించినా సమస్య పరిష్కారమవుతుందని పీఏయూఎంఎస్‌ అధ్యక్షుడు ఆర్‌.బి.గుప్త పేర్కొన్నారు. దీనిపై ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు చెప్పారు. తెలంగాణకు చెందిన అశోక్, శ్రీనివాస్‌ మాట్లాడుతూ తమ పిల్లలకు సీట్లు ఇస్తామంటూ హంగరి, పోలండ్‌ల యూనివర్సిటీల నుంచి ఫోన్లు వస్తున్నాయని, అయితే ఆ దేశాలపైనా రష్యా దాడి చేయొచ్చనే భయంతో అక్కడకు పంపేందుకు సిద్ధంగా లేమన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలల్లో చదువుకునేందుకు తమ పిల్లలకు అవకాశం కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.