• facebook
  • whatsapp
  • telegram

Adharsh Schools: ఆదర్శ పాఠశాలల్లో ఇంధన పొదుపు చర్యలు  

ఏటా 3.79 ఎంయూల విద్యుత్‌ ఆదా
ఈనాడు, అమరావతి: ఆదర్శ పాఠశాలలు, వాటి వసతి గృహాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న ఇంధన సామర్థ్య ఉపకరణాల వినియోగం వల్ల ఏటా 3.79 మిలియన్‌ యూనిట్ల (ఎంయూ) విద్యుత్‌ ఆదా చేసినట్లు ఇంధన శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రవేశపెట్టిన స్పీడ్‌ (స్టేట్‌ పార్టనర్‌షిప్‌ ఫర్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ డెమానిస్ట్రేషన్‌) ప్రోగ్రాం కింద ప్రాజెక్టులను అమలు చేస్తున్నట్లు పేర్కొంది. ‘‘రాష్ట్రంలోని 85 మోడల్‌ స్కూళ్లలో ఇంధన సామర్థ్య ఉపకరణాలను ఏర్పాటు చేశాం. ఇందులో 51 పాఠశాలల్లో విద్యుత్‌ వినియోగ ప్రభావంపై శాస్త్రీయంగా అధ్యయనం చేశాం. విద్యుత్‌ ఆదా వల్ల ఏడాదిలో రూ.23 లక్షలు మిగిలాయి. 85 పాఠశాలల్లో ఏటా 6.31 లక్షల యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేయడానికి అవకాశం ఉంది. గ్రామీణ నీటి సరఫరా పథకాలు, ఈహెచ్‌టీ సబ్‌ స్టేషన్లు, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలు చేస్తున్నాం’’ అని వివరించింది.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.