• facebook
  • whatsapp
  • telegram

AP Schools: ఏపీలో జులై 5 నుంచి ఏప్రిల్‌ 29 వరకు బడులు

అకడమిక్‌ క్యాలెండర్‌ను విడుదల చేసిన ఎస్‌సీఈఆర్టీ

ఈనాడు, అమరావతి: ఏపీలోని పాఠశాలలు జులై 5 నుంచి పునఃప్రారంభమై వచ్చే ఏడాది ఏప్రిల్‌ 29వ తేదీ వరకు కొనసాగనున్నాయి. పాఠశాలలకు ఉండే మూడు స్థానిక సెలవులను వినియోగించుకుంటే వాటికి బదులు అదే నెలలో రెండో శనివారం, ఆదివారాల్లో బడులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ప్రతి ఏడాది జూన్‌ 12న పాఠశాలలు పునఃప్రారంభమై ఏప్రిల్‌ 23వరకు కొనసాగేవి. ఈ ఏడాది పునఃప్రారంభ సమయాన్ని మార్చేశారు. జులై ఐదో తేదీకి తీసుకొచ్చారు. జులై 5 నుంచి ఏప్రిల్‌ 29 వరకు 2022-23 విద్యా సంవత్సరంలో బడులు 220 రోజులు పని చేస్తాయి. 1-9 తరగతులకు సమ్మెటివ్‌-2 పరీక్షలు ఏప్రిల్‌ 27తో ముగుస్తాయి. ఈ మేరకు 2022-23 విద్యా సంవత్సరానికి రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్టీ) అకడమిక్‌ క్యాలెండర్‌ను విడుదల చేసింది.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఫిజియోథెరపీలో ప్రామాణిక శిక్షణ

‣ ఆయుధ సంపత్తికి సమరం సెగ

‣ పల్లె బ్యాంకుల్లో వేల కొలువులు

‣ అన్ని పరీక్షల్లోనూ ఉండే ప్రశ్నలివి!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.