కానూరు, న్యూస్టుడే: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీలో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్-2022 జులై 4 నుంచి ప్రారంభం కానుంది. ఈ విద్యా సంవత్సరం ఎన్టీఆర్ జిల్లాలో 9 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ జిల్లా నుంచి మొత్తం 23768 మంది విద్యార్థులకు పరీక్ష కేంద్రాలు కేటాయించారు. కృష్ణా జిల్లాలో 2 కేంద్రాలు కేటాయించగా.. వీటిలో 2699 మంది పరీక్ష రాయనున్నారు. ఇంజినీరింగ్ విభాగం విద్యార్థులకు 8వ తేదీ వరకు, మెడికల్ విభాగం విద్యార్థులకు 11, 12 తేదీల్లో పరీక్ష జరగనుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఈ పరీక్ష ఆన్లైన్లో జరుగుతుంది. పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, వాచ్లను అనుమతించేదిలేదని అధికారులు తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.