1. Versity: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు ప్రత్యేక విశ్వవిద్యాలయం
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్రంలోని 162 డిగ్రీ కళాశాలలను ఈ వర్సిటీ పరిధిలోకి తీసుకొస్తారు. ప్రభుత్వ కళాశాలలన్నీ విశ్వవిద్యాలయ కళాశాలలుగా మారిపోనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి ఉన్నత విద్యామండలి ప్రతిపాదనలు పంపింది. వర్సిటీ ఏర్పాటు ఎలా చేయాలి? పరిపాలన, పర్యవేక్షణకు అవలంబించాల్సిన విధానాలను ఇందులో పేర్కొన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. EAPCET: 11 కేంద్రాల్లో ఈఏపీసెట్
కానూరు, న్యూస్‌టుడే: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీలో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్-2022 జులై 4 నుంచి ప్రారంభం కానుంది. ఈ విద్యా సంవత్సరం ఎన్టీఆర్ జిల్లాలో 9 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ జిల్లా నుంచి మొత్తం 23768 మంది విద్యార్థులకు పరీక్ష కేంద్రాలు కేటాయించారు. కృష్ణా జిల్లాలో 2 కేంద్రాలు కేటాయించగా.. వీటిలో 2699 మంది పరీక్ష రాయనున్నారు. ఇంజినీరింగ్ విభాగం విద్యార్థులకు 8వ తేదీ వరకు, మెడికల్ విభాగం విద్యార్థులకు 11, 12 తేదీల్లో పరీక్ష జరగనుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. Free Education: ఎన్టీఆర్ ట్రస్టు ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం
ఈనాడు డిజిటల్, అమరావతి: ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా చల్లపల్లిలోని ఎన్టీఆర్ ఉన్నత పాఠశాలలో 40మంది పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించనున్నట్లు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. 6, 7, 8, 9 తరగతుల్లో ఒక్కో తరగతికి 10 మంది చొప్పున ఉచిత విద్య అందించాలని నిర్ణయించినట్లు జులై 3న ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. Books: ముద్రణాలయంలో పుస్తకాల విక్రయ కేంద్రం
ఖైరతాబాద్: ఖైరతాబాద్‌లోని రాష్ట్ర ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణాలయ ఆవరణలో పాఠ్యపుస్తకాల విక్రయ కేంద్రం ప్రారంభమైంది. కొవిడ్ కారణంగా రెండేళ్లుగా కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదని, ఈ ఏడాది సాధారణ పరిస్థితులు నెలకొనడంలో స్టాల్‌ను ఏర్పాటు చేసినట్లు ముద్రణాలయం డైరెక్టర్ శ్రీనివాసచారి వివరించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. IT Job: 13 ఏళ్లు.. 17 కంప్యూటర్ కోర్సులు
కోయంబత్తూరు, న్యూస్‌టుడే: పదమూడు సంవత్సరాలకే పదిహేడు కంప్యూటర్ కోర్సులు నేర్చుకుని ప్రత్యేకత చాటుతున్నాడు తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన 9వ తరగతి విద్యార్థి అర్నవ్. అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో పని చేసే అవకాశం వచ్చినా ఉన్నత చదువులను దృష్టిలో ఉంచుకుని వదులుకున్నాడు. ఇటీవల కోయంబత్తూరు సీఐటీ కళాశాలలో కంప్యూటర్ ఇంజినీరింగ్‌శాఖ ఆధ్వర్యంలో జరిగిన సెమినార్లో ప్రత్యేక అతిథిగా అర్నవ్ ప్రసంగించి ఆకట్టుకున్నాడు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.