• facebook
  • whatsapp
  • telegram

Intinta Innovator: ‘ఇంటింటా ఇన్నోవేటర్‌’కు దరఖాస్తుల ఆహ్వానం

కరీంనగర్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలోని అన్ని విభాగాల అధికారులకు, ఔత్సాహికులకు తమ ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా ఇన్నోవేటర్‌ ఆవిష్కరణలకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పాలనాధికారి ఆర్‌.వి.కర్ణన్‌ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, రైతులు, యువత, ఐటీ నిపుణులు, గృహిణులు, పరిశోధకులు, అన్ని విభాగాల వారు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. కనుగొన్న వినూత్న ఆవిష్కరణను 9100678543 నెంబరుకు వాట్సప్‌ ద్వారా ఆగ‌స్టు 5వ తేదీలోపు పంపించాలని సూచించారు. వచ్చిన దరఖాస్తుల నుంచి మొదటి షార్ట్‌లిస్ట్‌ తరువాత జిల్లా నుంచి అయిదుగురి ఆవిష్కరణలను ఎంపిక చేస్తామని చెప్పారు. వీరికి స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రశంసాపత్రంతో అభినందించడం జరుగుతుందని తెలిపారు. ఆవిష్కరణలకు సంబంధించిన 6 వ్యాఖ్యల రెండు నిమిషాల వీడియోను, ఆవిష్కరణ ఫొటోలు, ఆవిష్కర్త పేరు, ఫోన్‌ నెంబరు, వృత్తి, గ్రామం, జిల్లా పేరును వాట్సప్‌ ద్వారా పంపించాలని వివరించారు. మరిన్ని వివరాలకు జిల్లా సైన్స్‌ అధికారి చాడ జయపాల్‌రెడ్డి(9849465546), బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ కో-ఆర్డినేటర్‌ కె.ఎస్‌.అనంతచార్య(9441195765)ను సంప్రదించాలని సూచించారు.


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.