• facebook
  • whatsapp
  • telegram

KU Degree Exams: 11, 12వ తేదీల్లో కేయూ డిగ్రీ పరీక్షలు వాయిదా

కేయూ క్యాంపస్, న్యూస్‌టుడే: భారీ వర్షాల కారణంగా కాకతీయ విశ్వవిద్యాలయం జులై 11, 12వ తేదీల్లో నిర్వహించే డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి.మల్లారెడ్డి జులై 10న‌ తెలిపారు. 11న జరిగే బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఏ ఒకేషనల్‌ నాలుగో సెమిస్టర్, 12న జరిగే డిగ్రీ రెండో, ఆరో సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేసినట్లు స్పష్టం చేశారు. డిగ్రీ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలను ఆగ‌స్టు 2వ తేదీన, రెండు, ఆరు సెమిస్టర్‌ పరీక్షలను ఆగ‌స్టు 3వ తేదీన, బీసీఏ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలను జులై 13న, ఒకేషనల్‌ రెండో సెమిస్టర్‌ పరీక్షలను 21న, నాలుగో సెమిస్టర్‌ పరీక్షలను 22న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు, పరీక్షా కేంద్రాల నిర్వాహకులు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు.  
 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సివిల్స్‌ విజేతలకు అద్భుత శిక్షణ

‣ విపత్కర సమయాల్లో ధైర్యంగా ఉండే?

‣ సమస్యలు పరిష్కరించే సత్తా మీలో ఉందా?

‣ ఆలోచనల పరిధి పెంచే ఐఐటీ కోర్సు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 11-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.