• facebook
  • whatsapp
  • telegram

Adharsh Schools: ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు నేడు విద్యార్థుల ఎంపిక

రెడ్డిగూడెం, గంపలగూడెం, న్యూస్‌టుడే: జిల్లాలోని గంపలగూడెం మండలం పెదకొమిర, రెడ్డిగూడెం మండలం మద్దులపర్వ ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి, ప్రథమ ఇంటర్‌లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులను జులై 12న విజయవాడ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఎంపిక చేస్తామని జిల్లా విద్యాధికారిణి సి.వి.రేణుక ప్రకటించారు. రిజర్వేషన్‌ ప్రాతిపదికన లాటరీ విధానంలో విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు జూన్‌లో విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. 6వ తరగతిలో 100 మందికి, ప్రథమ ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీల్లో 40 మంది చొప్పున ప్రవేశాలకు అనుమతిస్తారు. జులై 12న ఉదయం 10 గంటలకు నిర్వహించే ఎంపిక ప్రక్రియకు దరఖాస్తు చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హాజరుకావాలని అధికారులు కోరారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.