• facebook
  • whatsapp
  • telegram

Tamilnadu Students: ఏఐడీఈఎఫ్‌ విజేతలుగా ‘శాస్త్ర’ విద్యార్థులు

ఈనాడు, చెన్నై: రక్షణశాఖ ఆధ్వర్యంలో దిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇన్‌ డిఫెన్స్‌ (ఏఐడీఈఎఫ్‌)’ సదస్సులో తమిళనాడుకు చెందిన ఇద్దరు విద్యార్థులు విజేతలుగా నిలిచారు. శాస్త్ర యూనివర్సిటీకి చెందిన వెంకటేశ్‌ కుమార్, నిజ సుజిత ‘జెన్‌నెక్స్ట్‌ ఏఐ సొల్యూషన్స్‌’ పోటీలో భాగంగా కృత్రిమ మేధకు సంబంధించిన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. విజేతలుగా దేశవ్యాప్తంగా ముగ్గురు విద్యార్థుల్ని ఎంపిక చేశారు. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జులై 11న విజేతలను ప్రకటించి, జ్ఞాపికల్ని బహూకరించారు. సముద్రంలో జరిగే ఆపరేషన్స్‌పై వెంకటేశ్‌కుమార్‌ డ్రోన్‌ సాంకేతికత, కృత్రిమమేధ ఆలోచనల్ని సదస్సులో వివరించారు. కుంగుబాటు, ఒత్తిడి, ఆందోళనల్ని గుర్తించేందుకు కృత్రిమమేధ వినియోగంపై నిజసుజిత విశ్లేషించారు. వెంకటేశ్‌కుమార్‌ బీటెక్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్, నిజసుజిత ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్నారు. వారి విజయంపై శాస్త్ర యూనివర్సిటీ యజమాన్యం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేసింది.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.