• facebook
  • whatsapp
  • telegram

AP Abroad Education: కొత్త పేరుతో మళ్లీ అమల్లోకి విదేశీ విద్య

‘జగనన్న విదేశీ విద్యా దీవెన’గా పేరు మార్పు 
మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం

ఈనాడు డిజిటల్, అమరావతి: విదేశాల్లో ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించేందుకు విదేశీ విద్య పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ అమల్లోకి తీసుకురానుంది. ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పేరుతో దీన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం జులై 11న ప్రకటించింది. విదేశీ విద్య పథకాన్ని గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, కాపు, ఇతర సామాజికవర్గాలకు చెందిన విద్యార్థులకు అమలు చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక విజిలెన్స్‌ విచారణ పేరుతో దాన్ని నిలిపేసింది. పథకాన్ని అమలు చేయాలని గత మూడేళ్లుగా వివిధ వర్గాల నుంచి ప్రభుత్వానికి డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా మళ్లీ అమల్లోకి తీసుకురాబోతున్నట్లు పేర్కొంది. టాప్‌ 200 విదేశీ విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించిన వారందరికీ సంతృప్తకర స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తామని ప్రకటించింది. అయితే గత ప్రభుత్వ హయాంలో పథకానికి అర్హత సాధించి విదేశాల్లో చదువుకుంటున్న కొంతమంది విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలపై మాత్రం ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సైబ‌ర్ సంర‌క్ష‌ణ కొలువులు

‣ కుదురుగా కూర్చుంటున్నారా?

‣ చదువుకునే వారికి చక్కటిచోటు ముంబయి

‣ ఈ డిప్లొమాలు ప్రత్యేకం

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.