• facebook
  • whatsapp
  • telegram

TS EAMCET: తెలంగాణ ఎంసెట్‌... అగ్రికల్చర్‌ పరీక్ష వాయిదా

* జులై 18 నుంచి 20 వరకు జరగాల్సిన ఇంజినీరింగ్‌ ఎంసెట్‌ యథాతథం

 

 

హైదరాబాద్‌: భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ఎంసెట్‌ పరీక్ష నిర్వహణపై నెలకొన్న సందిగ్ధతపై ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ వర్షాలు కురుస్తున్నందున జులై 14, 15న జరగాల్సిన ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్షను వాయి వేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జులై 18 నుంచి 20 వరకు జరగాల్సిన ఇంజినీరింగ్‌ ఎంసెట్‌ యథాతథంగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.  

 

గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నందున ఎంసెట్‌ నిర్వహణపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఎంసెట్‌ జులై 14వ తేదీ నుంచి మొదలవుతుందా? లేదా? అన్న దానిపై సందిగ్ధం నెలకొంది. జులై 14, 15 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించిన నేపథ్యంలో ఉన్నత విద్యామండలి అధికారులు పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వంతో సంప్రదించి అగ్రికల్చర్‌ పరీక్ష వాయిదా వేసి.. ఇంజినీరింగ్‌ పరీక్షను యథాతథంగా జరపాలని నిర్ణయించారు.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పీజీసెట్‌కి సిద్ధమేనా?

‣ చేనేత డిప్లొమాతో చక్కని ఉపాధి

‣ స‌రికొత్త కాంబినేష‌న్ల‌తో డిగ్రీ కోర్సులు

‣ నిర్మాణ రంగంలో నాణ్య‌మైన కోర్సులు

‣ ప‌రిశ్ర‌మ‌ల‌కు స‌రిపోయేలా..!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.