• facebook
  • whatsapp
  • telegram

Skill Training: నైపుణ్యాల మెరుగుతోనే అవకాశాలు

మంత్రి కేటీఆర్‌
ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: ఉద్యోగం, స్వయంఉపాధి రంగాల్లో స్థిరపడాలనుకునే యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలని.. అప్పుడే అపార అవకాశాలను అందుకోవచ్చని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఆయన గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. అధిక వర్షాలపై కలెక్టరేట్లో జిల్లా యంత్రాంగంతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. అనంతరం జిల్లా గ్రంథాలయంలో టాస్క్‌ ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థులకు ఏర్పాటుచేసిన ప్రత్యేక నైపుణ్య శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఈ కేంద్రం ద్వారా ఆరు నెలల్లో ఎనిమిది రకాల కోర్సుల్లో రెండువేల మందికి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇష్టమైన రంగాన్ని ఎంపిక చేసుకుని శిక్షణ పొందవచ్చన్నారు. సృజనాత్మక ఆలోచనలతో టీహబ్‌, వీహబ్‌లను వినియోగించుకుని స్వయంఉపాధి రంగాల్లోనూ స్ధిరపడవచ్చని పేర్కొన్నారు. టీఎస్‌ఐపాస్‌ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల ఉద్యోగాలను సృష్టించామని, సిరిసిల్ల జిల్లాలోనూ టెక్స్‌టైల్‌ అనుబంధ, ఆక్వా హబ్‌, ఆహారశుద్ధి పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. కొత్త జోనల్‌ విధానం ద్వారా 80శాతం ఉద్యోగాలు స్థానికులకు లభించే అవకాశం ఉందని తెలిపారు.
మానేరును సందర్శించిన మంత్రి
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మాల ఎగువ మానేరు జలాశయాన్ని మంత్రి కేటీఆర్‌ సందర్శించి పూజలు వేశారు. అనంతరం కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్‌ఛార్జి, జగిత్యాల ఎస్పీ సింధుశర్మతో మంత్రి మాట్లాడుతూ.. ఎగువమానేరు జలాశయం నిర్మాణంలో తాము భూములు కోల్పోయామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రితో పలువురు పర్యాటకులు సెల్ఫీలు దిగారు. ఆయనకు మత్స్యకారులు చేపను బహూకరించారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 15-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.