• facebook
  • whatsapp
  • telegram

TS Gvt Schools: సర్కారు బడుల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్య

ఈనాడు, హైదరాబాద్‌: బోరబండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నాట్కో సంస్థ సహకారంతో అభివృద్ధి కావడంతో విశాలమైన భవనాలు, వసతులు సమకూరాయి. ఇప్పటికే పాఠశాలలో 1,800 మంది వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. అదనపు సెక్షన్లు ఏర్పాటు చేసినా.. సరిపడని పరిస్థితి. ప్రవేశాలకు విద్యార్థులు, తల్లిదండ్రులు పోటెత్తడంతో ఏకంగా తలుపులు మూయాల్సి వచ్చింది. 
చేరికలే చేరికలు..
ప్రభుత్వ బడి అంటే పెద్దగా చేరికలు ఉండేవి కావు. ఇప్పుడు పరిస్థితి మారింది. గ్రేటర్‌ మూడు జిల్లాల్లో పది బడుల్లో వేయి మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆయా పాఠశాలల్లో విశాలమైన తరగతి గదులు.. భవనాలు.. ప్రాంగణం.. వంటి వసతులకు తోడు ఏటా మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. ఇవే కాకుండా మరో 23 పాఠశాల్లో 900కుపైగా విద్యార్థులు ఉన్నారు.
అత్యధిక విద్యార్థులున్న పాఠశాలలు..
సీపీఎల్‌ అంబర్‌పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఫిలింనగర్, నాంపల్లి బాలుర ఉన్నత పాఠశాల కుల్సుంపురా, బోరబండ, శేరిలింగంపల్లి, సరూర్‌నగర్, శివరాంపల్లి, కుత్బుల్లాపూర్, జగద్గిరినగర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలల్లో అన్నింట్లో కలిపి మొత్తం 1000పైగా విద్యార్థులు చేరారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ 294 ఖాళీల‌తో హెచ్‌పీసీఎల్ ఆహ్వానం

‣ దూర‌విద్య‌లో యూజీ, పీజీ, డిప్లొమా కోర్సులు

‣ సైబ‌ర్ సంర‌క్ష‌ణ కొలువులు

‣ కుదురుగా కూర్చుంటున్నారా?

‣ చదువుకునే వారికి చక్కటిచోటు ముంబయి

‣ ఈ డిప్లొమాలు ప్రత్యేకం

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.