• facebook
  • whatsapp
  • telegram

Private Schools: ప్రైవేటు బడుల్లో పేదలకు 25 శాతం సీట్లు

ఏపీలో విద్యా హక్కు చట్టానికి సవరణ 
ఈనాడు, అమరావతి: ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించేందుకు విద్యా హక్కు చట్టం-2010ను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌ మూడు, నాలుగు రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. ప్రైవేటు పాఠశాలల్లో కల్పించే 25 శాతం ప్రవేశాలకు ప్రభుత్వం ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర బోర్డు అనుమతి ఉన్న పాఠశాలలకు రూ.15వేలు, సీబీఎస్‌ఈ పాఠశాలలకు రూ.35వేలుగా ఫీజులను నిర్ణయించారు. ప్రవేశాల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించనున్నారు. ఇందులో ప్రైవేటు పాఠశాలలు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకటో తరగతి లేదా ఎల్‌కేజీలో 25శాతం సీట్లను యాజమాన్యాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రవేశాలకు తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లో పాఠశాలలను ఎంపిక చేసుకోవాలి. అనంతరం లాటరీ విధానంలో సీట్లను కేటాయిస్తారు. ప్రైవేటులో సీట్లు ఖాళీగా ఉంటే విద్యార్థి నివాస ప్రాంతానికి మూడు, ఐదు కిలోమీటర్ల దూరంలోని వాటిల్లో ప్రవేశాలు కల్పిస్తారు. సీబీఎస్‌ఈ బడుల్లో పూర్తయినందున ఈ ఏడాదికి వీటిల్లో విద్యా హక్కు చట్టం కింద ప్రవేశాలు ఉండకపోవచ్చు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.