* ఆగస్టు 1న ఈసెట్
* రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో భారీవర్షాల కారణంగా వాయిదాపడిన ఎంసెట్ అగ్రికల్చర్ విభాగం పరీక్షలను జులై 30, 31 తేదీల్లో నిర్వహించనున్నారు. కొత్త తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి జులై 19న వెల్లడించారు. అంతకుముందు ప్రకటించిన ప్రకారం జులై 14, 15 తేదీల్లో ఆ పరీక్ష జరగాల్సి ఉంది. పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాదిలోకి ప్రవేశించేందుకు జులై 13న నిర్వహించాల్సిన పరీక్షనూ వర్షాల వల్ల వాయిదా వేశారు. దాన్ని ఆగస్టు 1న జరుపుతామని ఆయన తెలిపారు. ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి పీజీ ఈసెట్‌ను ఆగస్టు 2 నుంచి 5 వరకు నిర్వహించేలా మార్పు చేశామని లింబాద్రి చెప్పారు. హాల్‌టికెట్లపై తేదీలను మార్పుచేసి కొత్తవి అందించనున్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో కొన్ని పరీక్షా కేంద్రాలు మారవచ్చని భావిస్తున్నారు. కొత్త తేదీల్లో అప్పటికే టీసీఎస్ అయాన్ సంస్థ ఇతర పరీక్షలకు కేటాయించి ఉంటే అప్పుడు కొన్ని కేంద్రాలు మారవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. ఈసెట్ హాల్‌టికెట్లను జులై 28వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ ఆచార్య విజయకుమార్‌రెడ్డి చెప్పారు. ఎంసెట్ హాల్‌టికెట్లను ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనేది త్వరలో ప్రకటిస్తామని కన్వీనర్ ఆచార్య గోవర్ధన్ తెలిపారు.
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ మరోసారి టాప్ ర్యాంకులో మద్రాస్ ఐఐటీ
‣ పది పాసైతే ప్రభుత్వ ఉద్యోగాలు
‣ మెయిన్‌లో మెరిసేందుకు మరో అవకాశం!
‣ ప్రావీణ్యం పెంచే వృత్తి విద్య
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.