ఇంజినీరింగ్ యువతకు మంచి రోజులు
నిన్న: ఉద్యోగులకు వృత్యంతర నైపుణ్యం అవసరం. కళాశాలలో వాటిని విద్యార్థులకు అందించే వారు లేక చాలా మంది అనేక మంచి అవకాశాలు కోల్పోతున్నారు.
నేడు: బహుళజాతి సంస్థలు కళాశాలలోనే విద్యార్థులకు నైపుణ్యాలను ఇంటర్న్‌షిప్ రూపంలో అందిస్తున్నాయి. దీనిని అందిపుచ్చుకుంటే ఉపాధి అవకాశాలు సులువుగా పొందే వీలుంది.
కరోనా అనంతరం ఉమ్మడి కృష్ణా జిల్లాలో పరిస్థితి సాంకేతిక విద్యార్థులకు అనుకూలంగా మారింది. 2021-22 ఏడాదికి అనేక మంది విద్యార్థులు మంచి వార్షిక వేతనాలతో ఉద్యోగాలను సాధించారు. గతంలో లేని విధంగా అమెజాన్ వంటి సంస్థ.. జిల్లా నుంచి 6 మంది విద్యార్థులను రూ.44 లక్షల వార్షిక వేతనంతో ఎంపిక చేసింది. ఇవి కాకుండా రూ.25 లక్షల పైబడి మరో 20 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరంతా ఇంటర్న్‌షిప్ చేయడం ద్వారా నైపుణ్యాలను అందిపుచ్చుకుని ఈ ఘనత సాధించడం విశేషం. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కావాల్సిన నైపుణ్యాలను అందించడంలో ఇంటర్న్‌షిప్(వృత్యంతర నైపుణ్యం) పాత్ర కీలకంగా మారింది.
‣ ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం.. ప్రతి ఇంజినీరింగ్ కళాశాలో విద్యార్థులు తమ కోర్సు కాలంలో ఆరు వారాలు ఇంటర్న్‌షిప్ చేయాలని సూచించింది. కానీ రెండు జిల్లాల్లో కేవలం కొన్ని కళాశాలలు మాత్రమే దీనిని తప్పనిసరిగా అనుసరిస్తున్నాయి. అందుకే ఇటువంటి కళాశాలల విద్యార్థులు తమ ప్రతిభ చాటుతున్నారు.
‣ కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధి కళాశాలల్లో చివరి సంవత్సరం విద్యార్థులు 6 లేదా 8వ సెమిస్టర్లో వృత్యంతర నైపుణ్య శిక్షణ తీసుకుంటున్నారు. ఇలాంటి వారి శాతం ఇప్పుడు 45కు పైగా ఉందని అంచనా. జేఎన్టీయూకే పరిధిలో బీటెక్‌లో ప్రతి సెమిస్టర్లో 75 శాతం హాజరు ఉండాలన్న నిబంధన ఉంది. ఈ కారణంగా ఎక్కువ మంది విద్యార్థులు ఇంటర్న్‌షిప్ తీసుకోవడం లేదన్న అవగతమవుతోంది.
అందిస్తున్న సంస్థలు
రెండు జిల్లాల్లో సౌత్ సెంట్రల్ రైల్వేస్, బీఎన్ఎన్ఎల్, ఇస్రో, దూరదర్శన్, వీటీపీఎస్, భెల్, ఎఫ్ట్రానిక్స్, డీఆర్‌డీఎల్‌తో పాటు మరో 60 వరకు ప్రైవేటు సంస్థలు వృత్యంతర నైపుణ్య శిక్షణ ఇస్తున్నాయి. అలాగే బహుళజాతి సంస్థలు కళాశాలల్లో విద్యార్థులను ఎంపిక చేసుకుని వారికి కూడా ఈ తరహా శిక్షణ అందిస్తున్నాయి. అలాగే ఐఐటీలు అనీ కలిసి ఇంటర్న్‌షిప్ ఇచ్చే సంస్థలను ఏకతాటిపైకి తీసుకువచ్చాయి. ప్రస్తుత తరుణంలో విదేశీ సంస్థలూ మన విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాయి.
శిక్షణ వల్ల ఉపయోగాలు
పరిశ్రమలతో అనుసంధానం ఏర్పడుతుంది.బీ చదువుతో పాటు యంత్రాలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవచ్చు.బీ పరిశ్రమల్లో నిపుణులైన వారితో పలు విషయాలను పంచుకోవచ్చు. బీ శిక్షణ సమయంలో గుర్తింపు పొందితే అక్కడే ఉద్యోగం పొందే అవకాశముంది.బీ పరిశ్రమలు ఇచ్చే ధ్రువపత్రం ఎంతో ఉపయోగం ఉంటుంది.బీ శిక్షణ కాలంలో ఆయా సంస్థలు రూ.40 వేల వరకు స్టైఫండ్ ఇస్తాయి.
సద్వినియోగం చేసుకోవాలి: జి.నాగేంద్రకుమార్, సాఫ్ట్ట్వేర్ నిపుణుడు
సాంకేతిక విద్యార్థులకు ఇదో చక్కని అవకాశం. సంస్థలు ఇచ్చే వృత్యంతర నైపుణ్య శిక్షణను సద్వినియోగం చేసుకుంటే అటు వారికి, ఇటు పరిశ్రమలకు ఉపయుక్తంగా ఉంటుంది. సమయం కూడా కలిసి వస్తుంది. మెరుగైన భవిష్యత్తు సాకారమవుతుంది.
ఇంటర్న్‌షిప్ కీలకం: రావి వెంకటరావు
పరిశ్రమలు ఇచ్చే ఇంటర్న్‌షిప్ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కీలకం. ఆయా సంస్థలు ఇచ్చే ధ్రువపత్రాలకు విలువ ఉంటుంది. ఈ విషయాన్ని విద్యార్థులు గ్రహించాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ సంస్థలు కూడా వీటిలో శిక్షణ ఇవ్వడానికి ముందుకు రావడం శుభపరిణామం.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.