• facebook
  • whatsapp
  • telegram

Gate-23: ఫిబ్రవరి 4 నుంచి గేట్‌-23

సెప్టెంబరు తొలి వారం నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: ఐఐటీల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ చేసేందుకు.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కొలువుల్లో చేరడానికి నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌(గేట్‌)-2023 వచ్చే ఫిబ్రవరిలో జరగనుంది. ఫిబ్ర‌వ‌రి 4, 5, 11, 12 తేదీల్లో ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఈసారి పరీక్షల నిర్వహణ బాధ్యత ఐఐటీ కాన్పూర్‌కు దక్కింది. దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబరు మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఇందుకోసం ఆగ‌స్టులో నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. బీటెక్‌తో పాటు బీఎస్సీ, బీకాం, బీఏ విద్యార్థులూ ఈ పరీక్ష రాయవచ్చు. బీటెక్‌ మూడో సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులే. మొత్తం 29 సబ్జెక్టుల్లో పరీక్షలు ఉంటాయి. పరీక్షకు సంబంధించి ఐఐటీ కాన్పూర్‌ త్వరలో వెబ్‌సైట్‌ను ప్రారంభించనుంది. గేట్‌లో వచ్చిన స్కోర్‌ ఆధారంగా పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలిస్తాయి. గేట్‌-2022కు 7.11 లక్షల మంది హాజరుకాగా వారిలో 1.26 లక్షల మంది కనీస మార్కులు సాధించి ఉత్తీర్ణులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచే లక్ష మంది వరకు ఈ పరీక్షకు హాజరవుతారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సిలబస్‌ అంతా చదవాలి.. ప్రశ్నలు సాధన చేయాలి!

‣ మెరుగైన స్కోరుకు మేలైన వ్యూహం!

‣ గెలుద్దాం గేట్‌

‣ టాప్‌ ర్యాంకు కోసం ఇదిగో వ్యూహం!

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.