• facebook
  • whatsapp
  • telegram

AP Gvt Schools: ప్రభుత్వ బడుల్లో అభ్యసన అభివృద్ధి కార్యక్రమం

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లోని 6,7,8 తరగతుల విద్యార్థుల అభ్యసన అభివృద్ధికి యూనిసెఫ్, సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ ఇన్‌ పబ్లిక్‌ సిస్టం(సీఐపీఎస్‌), సేవ్‌ ది చిల్డ్రన్, గ్రామ, వార్డు సచివాలయ శాఖలతో పాఠశాల విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థులకు ప్రాథమిక పరీక్ష నిర్వహించి, అభ్యసన స్థాయిలను గుర్తిస్తారు. అభ్యసన అభివృద్ధి కింద వారి స్థాయిలను అనుసరించి అక్షరాలు, పదాలు, వాక్య నిర్మాణం, గణితం, కమ్యూనికేషన్‌ సామర్థ్యాలపై శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, అనంతపురం, శ్రీసత్యసాయి, వైయస్‌ఆర్, అన్నమయ్య జిల్లాల్లో అమలుచేస్తారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.