• facebook
  • whatsapp
  • telegram

Online Attendance: ఆన్‌లైన్‌ హాజరు నమోదులో ఆలస్యమైతే షోకాజ్‌ నోటీసులు

ఈనాడు, అమరావతి: పాఠశాలల్లో ఉదయం 10.30గంటలలోపు విద్యార్థుల హాజరును ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోతే ఉపాధ్యాయులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విద్యార్థి హాజరు యాప్‌లో సకాలంలో నమోదు చేయలేదంటూ కర్నూలు జిల్లాలో పలు పాఠశాలలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు ఉపాధ్యాయులు వెల్లడించారు. ఉదయం 9.15కు ప్రార్థన పూర్తవుతుందని, ఆలస్యంగా వచ్చే విద్యార్థుల కోసమని మొదటి పీరియడ్‌ తర్వాత హాజరు తీసుకుంటామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మొదట రిజిస్టర్‌లో హాజరు తీసుకొని, ఆ తర్వాత యాప్‌లో నమోదు చేయాలని, విద్యార్థులు సంఖ్య ఎక్కువగా ఉండడం, ఇంటర్నెట్‌ సమస్యలు ఏర్పడితే కొంచెం ఆలస్యమవుతుందని వెల్లడిస్తున్నారు. కొంత అదనపు సమయం ఇవ్వకుండా షోకాజ్‌ నోటీసులు ఇస్తూ ఒత్తిడి తీసుకురావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.