• facebook
  • whatsapp
  • telegram

Jee main: జేఈఈ మెయిన్‌... పరీక్ష కేంద్రాన్ని మార్చడంతో గందరగోళం

 

 

అనంతపురం: జేఈఈ మెయిన్‌ పరీక్ష కేంద్రాన్ని ఉన్నఫళంగా మార్చడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అనంతపురం జిల్లా జేఎన్‌టీయూ పరిధిలోని సీఆర్‌ఐటీ కళాశాలలో కొంత మందికి జేఈఈ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ ఉదయం పరీక్ష రాయడానికి వెళ్లగా సెంటర్‌ను జేఎన్‌టీయూకు మార్చామని, అక్కడకు వెళ్లాలని సిబ్బంది సూచించారు. దీంతో అభ్యర్థులు అక్కడ నుంచి జేఎన్‌టీయూకు పరుగులు తీశారు. దాదాపు 10 కిలోమీటర్ల దూరంలోని జేఎన్‌టీయూకు చేరుకోవడానికి వారికి అరగంటకు పైగా సమయం పట్టింది. అందులోనూ 100 మందికి సెంటర్‌ కేటాయించగా.. అక్కడ 50 కంప్యూటర్లు మాత్రమే ఏర్పాటు చేయడం గమనార్హం. దీంతో రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించి పూర్తి చేశారు. ఆల్ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) ఆఖరి క్షణంలో సెంటర్‌ మార్చడంతోనే ఈ గందరగోళం చోటుచేసుకున్నట్లు సమాచారం.

 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నీకు నువ్వు న‌చ్చ‌ట్లేదా?

‣ ఆరోగ్య రక్షణలో కోర్సుల్లోకి ఆహ్వానం

‣ ఎక్కువ పరీక్షలు రాశా.. తప్పులు సరిచేసుకున్నా!

‣ అగ్రికల్చర్‌ బ్యాంకులో ఆఫీసర్‌ ఉద్యోగాలు

‣ డేటాసైన్స్‌ ఉద్యోగాలకు డిమాండ్‌!

‣ దిల్లీలో హెడ్‌కానిస్టేబుల్‌ కొలువులు

‣ ఆతిథ్య రంగంలో అవకాశాలు అనేకం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.