ఈనాడు, దిల్లీ: బీఈడీ కోర్సుల ప్రారంభానికి దేశంలోని వివిధ ఐఐటీలు దరఖాస్తు చేసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ తెలిపారు. ఆయన జులై 25న లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జాతీయ విద్యా విధానంలో చెప్పినట్లుగా 2023-24 విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం నిర్వహణ కోసం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) ఈ ఏడాది మేలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యాసంస్థలు, యూనివర్సిటీల నుంచి దరఖాస్తులు ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. అందుకోసం ఖరగ్పుర్, మద్రాస్, గువాహటి, భువనేశ్వర్ ఐఐటీలు దరఖాస్తు చేశాయని కేంద్ర మంత్రి వెల్లడించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.