• facebook
  • whatsapp
  • telegram

Private Schools: ప్రైవేటు బడుల్లో 25% సీట్లు పేదలకు కేటాయింపు 

ఈనాడు, అమరావతి: ప్రైవేటు పాఠశాలల్లో పేదలకు 25% సీట్లు కేటాయించేందుకు విద్యా హక్కు చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ప్రైవేటు పాఠశాల ప్రవేశాల సమయంలో ఒకటో తరగతి లేదా పూర్వ ప్రాథమికలో 25% సీట్లు పేదలకు కేటాయించాలి. లాటరీ విధానంలో సీట్లు కేటాయిస్తారు. జగనన్న అమ్మఒడి పథకానికి ఉండే అర్హతలనే దీనికి అమలుచేస్తారు. పాఠశాలల్లో ప్రవేశాలు, సీట్లు కేటాయించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందిస్తుంది. ప్రైవేటులో ప్రవేశాలు పొందిన విద్యార్థుల ఫీజులను చెల్లించేందుకు ప్రతి ఏడాది మార్చి 31లోగా బిల్లులను సమర్పించాలి. అధికారులు పరిశీలించి ఆగస్టు 31లోగా చెల్లింపులు చేస్తుంది. విద్యాహక్కు చట్టం అమలుకు జిల్లాస్థాయిలో జిల్లా ప్రవేశాల పర్యవేక్షణ కమిటీ, రాష్ట్రస్థాయిలో రాష్ట్ర సలహా మండలి ఉంటాయి.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.