• facebook
  • whatsapp
  • telegram

SHAR: ‘ఆజాదీశాట్‌’ రూపొందించిన 750 మంది విద్యార్థినులు

అమృతోత్సవ వేళ కక్ష్యలోకి..

శ్రీహరికోట, న్యూస్‌టుడే: దేశంలోని 75 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థినుల భాగస్వామ్యంతో ‘ఆజాదీశాట్‌’ అనే ఉపగ్రహం రూపుదిద్దుకుంటోంది. దీన్ని 75 ఏళ్ల స్వాతంత్య్ర అమృత మహోత్సవాలకు గుర్తుగా ఆగస్టు మొదటి వారంలో కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి పాఠశాలల్లో 8 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న 10 మంది బాలికలను నీతి ఆయోగ్‌ భాగస్వామ్యంతో ఎంపిక చేశారు. ‘అంతరిక్షంలో మహిళలు’ అనే ఐక్యరాజ్య సమితి థీమ్‌ నేపథ్యంలో ‘ఆల్‌ ఉమెన్‌ కాన్సెప్ట్‌’తో దీన్ని రూపొందిస్తున్నారు. 8 కిలోల బరువున్న ఉపగ్రహం సమాచార సేవలందించనుంది. ఆజాదీశాట్‌ తయారీలో నారాయణవనం జడ్పీ ఉన్నత పాఠశాల (తిరుపతి జిల్లా), సెయింట్‌ ఫ్రాన్సిస్‌ బాలికల పాఠశాల(సికింద్రాబాద్‌), గురజాగుంట(తెలంగాణ), జేసీ ఎర్రుపాలెం టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ (తెలంగాణ), ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ స్కూల్‌, కురుగుంట (అనంతపురం), డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులం వీరలంకపల్లి(ఆంధ్రప్రదేశ్‌), జడ్పీ ఉన్నత పాఠశాల, జి.ఆర్మూరు(తెలంగాణ), జీహెచ్‌ఎస్‌, వెంగళ్‌రావునగర్‌(హైదరాబాద్‌)కు చెందిన విద్యార్థుల భాగస్వామ్యం ఉంది. ఇందుకు హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ సంస్థ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద రూ.58 లక్షలు సమకూర్చింది. చెన్నైలోని స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా సంస్థ సాంకేతిక సహకారం అందిస్తోంది. సాయం అందించిన 15 మంది స్పేస్‌ కిడ్జ్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో తిరుపతికి చెందిన సాయి, రఘుపతి, హైదరాబాద్‌కు చెందిన కీర్తన్‌ ఉన్నారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మెయిన్‌లో మెరిసేందుకు మ‌రో అవ‌కాశం!

‣ ప్రావీణ్యం పెంచే వృత్తి విద్య

‣ అర్థం చేసుకుంటూ చ‌దివితే..!

‣ దేశ రాజ‌ధానిలో కానిస్టేబుల్ ఉద్యోగాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.