• facebook
  • whatsapp
  • telegram

TS jobs: సబ్‌ఇంజినీర్‌ పోస్టుల రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

ఈనాడు, హైదరాబాద్‌: దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణి సంస్థ(డిస్కం)లో 201 సబ్‌ఇంజినీర్‌ పోస్టుల భర్తీ కోసం జులై 31న నిర్వహించనున్న రాత పరీక్ష కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సంస్థ సీఎండీ రఘుమారెడ్డి మీడియాకు తెలిపారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని వివిధ కేంద్రాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్ష ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సంస్థ వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. హాల్‌టికెట్‌లో ఇచ్చిన సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఉదయం 10.30 తరవాత పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని చెప్పారు. పరీక్ష సమయానికి గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, చివరి నిమిషంలో హడావుడిగా రావద్దని రఘుమారెడ్డి సూచించారు.  
 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.