ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తరఫున 1,681 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులను ఒప్పంద విధానంలో భర్తీచేసేందుకు నోటిఫికేషన్ వెలువడింది. బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ విత్ ఇంటిగ్రెల్ సీపీసీహెచ్ కోర్సు చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. నెలకు రూ.25వేల వేతనం అందజేస్తారు. ఆగస్టు 9 నుంచి 22వ తేదీ మధ్య దరఖాస్తులు స్వీకరిస్తారు. రాత పరీక్ష సెప్టెంబరులో ఆన్లైన్లో నిర్వహించే అవకాశం ఉందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్ తెలిపారు. వివరాలు cfw.ap.nic.in వెబ్సైట్లో ఉన్నాయి.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ మెరుగైన కొలువుకు మెడికల్ కోడింగ్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.