ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో మైనార్టీ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్, మెరిట్ ఉపకార వేతనాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ సంక్షేమశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఒకటి నుంచి పది వరకు చదువుతున్న ప్రీమెట్రిక్ విద్యార్థులు సెప్టెంబరు 30లోగా, ఇంటర్ ఆ పైన చదివే పోస్టుమెట్రిక్ విద్యార్థులు అక్టోబరు 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. విద్యార్థులు https://scholarships.gov.in/ పోర్టల్ ద్వారా దరఖాస్తులు అందజేయాలని, దరఖాస్తు చేసుకునేముందుగానే అర్హతలు పరిశీలించుకోవాలని సూచించింది. ఒకసారి దరఖాస్తు సమర్పించిన తరువాత అందులో మార్పులకు అవకాశం ఉండదని వెల్లడించింది. గత ఏడాది ఉపకారవేతనాలు పొందిన విద్యార్థులు ఆ ఉపకార దరఖాస్తు ఐడీతో ఈ ఏడాదికి రెన్యువల్ చేసుకోవాలని కోరింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.