• facebook
  • whatsapp
  • telegram

HCU: నేచర్‌ ఇండెక్స్‌ ర్యాంకుల్లో హెచ్‌సీయూ సత్తా  

ఈనాడు, హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మక నేచర్‌ ఇండెక్స్‌ ర్యాంకుల్లో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) సత్తా చాటింది. దేశంలో విశ్వవిద్యాలయాల కేటగిరీలో ప్రథమ స్థానం దక్కించుకుంది. మొత్తమ్మీద 16వ స్థానం సాధించింది. 72 పరిశోధనపత్రాల సంఖ్య, 19.46 షేర్‌తో ఆ స్థానం దక్కించుకున్నట్లు వర్సిటీ ఉపకులపతి ప్రొ.బీజే రావు తెలిపారు. ఈ ర్యాంకుల్లో బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ తొలిస్థానంలో నిలిచింది. ఈ సంస్థ ఆచార్యులకు సంబంధించి 194 పరిశోధనపత్రాలు నేచర్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పలు విద్యాసంస్థలూ చోటు దక్కించుకున్నాయి. ఐఐటీ హైదరాబాద్‌కు 23వ ర్యాంకు, ఐసెర్‌ తిరుపతికి 26వ ర్యాంకు, అమిటీ యూనివర్సిటీకి 54వ ర్యాంకు, నైపర్‌-హైదరాబాద్‌కు 76వ ర్యాంకు, ట్రిపుల్‌ఐటీ-హైదరాబాద్‌కు 82వ ర్యాంకు, ఆంధ్రా యూనివర్సిటీకి 92వ ర్యాంకు, జేఎన్‌టీయూ కాకినాడకు 108వ ర్యాంకు, ఐఐటీ తిరుపతికి 122వ ర్యాంకు దక్కాయి. 2021 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి.. ఈ ఏడాది మార్చి 31 మధ్య ప్రచురితమైన పరిశోధనపత్రాల ఆధారంగా నేచర్‌ జర్నల్‌ ఆయా ర్యాంకులను కేటాయించింది. ప్రధానంగా రసాయనశాస్త్రం, లైఫ్‌సైన్సెస్‌, భౌతికశాస్త్రంలో పరిశోధనలను ఆధారంగా తీసుకుంది.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ డేటాసైన్స్‌ ఉద్యోగాలకు డిమాండ్‌!

‣ నీకు నువ్వు న‌చ్చ‌ట్లేదా?

‣ ఎక్కువ పరీక్షలు రాశా.. తప్పులు సరిచేసుకున్నా!

‣ ఆతిథ్య రంగంలో అవకాశాలు అనేకం!

‣ డిజిటల్‌ గేమింగ్‌కు ఉజ్జ్వల భవిత

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.