* సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులపై ఏపీవీవీపీ కమిషనర్
ఈనాడు డిజిటల్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్, స్పెషలిస్ట్ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ వినోద్‌కుమార్ ఆగస్టు 12న ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నోటిఫికేషన్ ద్వారా నియమితులైన వైద్యులకు వేతన స్కేలు, ఇతర అలవెన్సులు లభిస్తాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు 50% అదనపు జీతం చెల్లించనున్నట్లు తెలిపారు. ఆన్లైన్ విధానంలో ఆగస్టు 26 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.