* తెలంగాణ పోలీసు నియామక మండలి
ఈనాడు, హైదరాబాద్: ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల్లో తప్పులు దొర్లడం సహజమేనని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆగస్టు 7న నిర్వహించిన ఎస్సై తత్సమాన ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్ష ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లిన దృష్ట్యా అభ్యర్థులకు మేలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రంలో వచ్చిన తప్పులపై ఆగస్టు 14న ఆయన వివరణ ఇస్తూ ప్రకటన జారీ చేశారు. ‘‘తప్పుగా నిర్ణయించిన ప్రశ్నలకు మార్కులు ఇచ్చే నియమాన్ని దేశవ్యాప్తంగా ప్రతి నియామక సంస్థ ఎంతోకాలంగా పాటిస్తుంది. ఇదేమీ కొత్త కాదు. ప్రశ్నపత్రాల తయారీ అనేక దశల్లో, అత్యంత రహస్యంగా జరుగుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కొన్ని ప్రశ్నలు అర్థం కాకపోవడం, అస్పష్టంగా ఉండటం, అనువాద దోషాల కారణంగా తప్పులు దొర్లడం, ఇచ్చిన జవాబుల్లో సరైనది లేకపోవడం, ఒకదానికి మించి ఎక్కువ జవాబులు ఉండటం వంటి పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. తప్పు ప్రశ్నలకు మార్కులు ఇవ్వడం వెనుక నియామక మండలి ఉద్దేశం.. అభ్యర్థులకు మేలు చేయడమే. సామాజిక మాధ్యమాల్లో వ్యాపించే ఊహాగానాలను ఎవరూ నమ్మవద్దు. అనుమానాల నివృత్తికి అభ్యర్థులు వెబ్సైట్ను అనుసరించాలి’’ అని శ్రీనివాసరావు సూచించారు.
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఆర్మీలో 191 టెక్నికల్ పోస్టులు
‣ మీడియాలో ప్రవేశానికి కొన్ని కోర్సులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.