• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 23-08-2022 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1. భారత్‌ జోడో యాత్ర

కాంగ్రెస్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘భారత్‌ జోడో యాత్ర’కు సంబంధించి దిల్లీలో లోగో, వెబ్‌సైట్, ట్యాగ్‌లైన్‌లను ఆవిష్కరించింది. ప్రజా ఉద్యమం తరహాలో దేశం మునుపెన్నడూ చూడనంత భారీ స్థాయిలో యాత్ర జరగనున్నట్లు తెలిపింది. దక్షిణాన కన్యాకుమారి నుంచి ఉత్తరాన కశ్మీర్‌ వరకు మొత్తం 3,570 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుందని పార్టీ సీనియర్‌ నేతలు జైరాం రమేశ్, దిగ్విజయ్‌ సింగ్‌ తెలిపారు. సెప్టెంబరు 7న మొదలై.. దాదాపు ఐదు నెలల పాటు అది సాగుతుందని పేర్కొన్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

2. తెలంగాణ జీస్‌డీపీలో 19.37% వృద్ధిరేటు        

తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో ప్రస్తుత ధరల ప్రకారం 19.37 శాతం వృద్ధిరేటు, తలసరి ఆదాయంలో 19.19 శాతం వృద్ధిరేటు నమోదయ్యాయి. రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.11,48,115 కోట్లు, తలసరి ఆదాయం రూ.2,75,443గా తేలింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి దేశంలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జీఎస్‌డీపీ, తలసరి ఆదాయం సవరించిన అంచనాలను ప్రస్తుత, స్థిర ధరల ఆధారంగా కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ (ఎంఓఎస్‌పీఐ) విడుదల చేసింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

3. 300 ఏళ్లలోనే అత్యంత కనిష్ఠానికి బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ

బ్రిటన్‌ దేశ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 2020 సంవత్సరంలో 11 శాతం క్షీణించినట్లు ఆఫీస్‌ ఫర్‌ నేషనల్‌ స్టాటిస్టిక్స్‌(ఓఎన్‌ఎస్‌) పేర్కొంది. ఇతర ఏ ప్రధాన ఆర్థిక వ్యవస్థతో పోల్చినా ఇదే ఎక్కువ కుంగుబాటు అని సవరించిన అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 1709 తర్వాత ఇదే అత్యధిక క్షీణత అని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ వద్ద ఉన్న గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

4. మలేసియాలో జైలు శిక్ష పడిన తొలి మాజీ ప్రధానిగా నజీబ్‌

‘1 మలేసియా అభివృద్ధి సంస్థ (1ఎండీబీ)’ నిధుల కుంభకోణం కేసులో తనకు హైకోర్టు 12 ఏళ్ల జైలుశిక్ష విధించడాన్ని (2020లో) దేశ అత్యున్నత న్యాయస్థానమైన ఫెడరల్‌ కోర్టులో సవాలు చేసిన మాజీ ప్రధానమంత్రి నజీబ్‌ రజాక్‌ అప్పీలును ఫెడరల్‌ న్యాయస్థానం కొట్టివేసింది. ‘‘ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనదే. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

5. అంకితకు వైల్డ్‌కార్డ్‌

భారత నంబర్‌వన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి అంకిత రైనాకు చెన్నై ఓపెన్‌లో వైల్డ్‌కార్డ్‌ లభించింది. సెప్టెంబరు 12 నుంచి 18 వరకు చెన్నైలో ఈ టోర్నీ జరగనుంది. 29 ఏళ్ల అంకితతో పాటు 2014 వింబుల్డన్‌ ఫైనలిస్టు యూజెనీ బౌచర్డ్‌ (కెనడా)కు కూడా వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ దక్కింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.