హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఐ-సెట్ (ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) ఫలితాలు ఆగస్టు 27న విడుదల కానున్నాయి. 3గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్టు కన్వీనర్ ఆచార్య కె.రాజిరెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో జులై 28న తెలంగాణలో 10, ఆంధ్రప్రదేశ్లో నాలుగు కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. మొత్తం 76,160మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. మొదటి విడత పరీక్షకు 90.93 శాతం, రెండో విడత పరీక్షకు 91.43 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా ఐసెట్ ప్రిలిమినరీ ‘కీ’ని ఆగస్టు 4న విడుదల చేశారు.\
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.