• facebook
  • whatsapp
  • telegram

TS PG Ecet - 2022 Results: తెలంగాణ పీజీ ఈసెట్‌ - 2022 ఫలితాలు

ఈనాడు, హైదరాబాద్‌: పీజీ ఇంజినీరింగ్‌ ఉమ్మడి ప్రవేశపరీక్ష(పీజీఈసెట్‌)-2022లో 91.48 శాతం మంది అర్హత సాధించారు. 19 విభాగాల్లో జరిగిన పరీక్షలకు మొత్తం 12,592 మంది హాజరుకాగా.. వారిలో 11,520 మంది ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సెప్టెంబర్‌ 3న ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, ఓయూ ఉపకులపతి ఆచార్య రవీందర్‌ ఫలితాలను విడుదల చేశారు. ఉత్తీర్ణులైన వారిలో 6,440 మంది(55.90 శాతం) అమ్మాయిలు, 5,080 మంది అబ్బాయిలు ఉన్నారని లింబాద్రి తెలిపారు. ఒక్క ఫార్మసీ విభాగంలోనే 5,186 మంది పాస్‌ అయ్యారని, మిగిలిన 6,334 మంది ఇతర 18 విభాగాల్లో ఉన్నారని పేర్కొన్నారు. ఏడు విభాగాల్లో అమ్మాయిలు టాపర్లుగా నిలిచారని కన్వీనర్‌ లక్ష్మీనారాయణ వెల్లడించారు.
 

తొలుత గేట్‌, జీప్యాట్‌ ర్యాంకర్లకు సీట్లు కేటాయిస్తామని.. వారిలో ఇప్పటివరకు 427 మంది దరఖాస్తు చేసుకున్నారని పీజీఈసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ ఆచార్య రమేశ్‌బాబు తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్‌ 7వ తేదీ వరకు గడువు ఉందన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీనివాసరావు, కాకతీయ వర్సిటీ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్‌ సమ్మయ్య, పీజీఈసెట్‌ కో-కన్వీనర్‌ రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.


 

 

 

 

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కొలువుల‌కు కొర‌త లేదు

‣ కాలేజీలో చేరేముందు కాస్త ప‌రిశీలించండి!

‣ న‌వ్విస్తే జీతం ఇస్తారు!

‣ శిక్ష‌ణ లేదు సొంత నోట్స్‌తో సాధించా!

‣ ఏదైనా ఎక్స్‌ట్రా చేయండి!

‣ పీజీసెట్‌కి సిద్ధమేనా?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.