• facebook
  • whatsapp
  • telegram

ఇదే చివరి అవకాశం

పదో తేదీ  వరకు ఇంటర్‌ ప్రవేశాలు

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు మరో అవకాశం కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వం మూడో విడత ప్రవేశాలకు షెడ్యూల్‌ విడుదల చేసింది.  ఇదే చివరి అవకాశంగా ఉత్తర్వుల్లో పేర్కొంది. 10వ తేదీలోగా చేరాల్సి ఉంది.
రెండు విడతల ప్రవేశాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చేరిన వారు గణనీయంగా తగ్గారు. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలైనందున మరికొందరు చేరనున్నారని అధికారులు భావిస్తున్నారు.

 

మూడు వేల సీట్లు ఖాళీ
2022-23 విద్యా సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో జనరల్‌, వృత్తి విద్యా కోర్సులు కలిపి 8,022 సీట్లు ఉన్నాయి. రెండు విడతల్లో 5,035 భర్తీ అయ్యాయి. 62.76 శాతం మంది ప్రవేశాలు పొందారు. విజయనగరంలో 53 శాతం, మన్యంలో 78.11 శాతం జరిగినట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది. పునర్విభజనకు ముందు ఉమ్మడి జిల్లాలో గత మూడేళ్లలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య సగటు ఆరు వేలకు పైగా ఉంది. ఈ ఏడాది ప్రవేశాలు గగనమవుతున్నాయి.

 

ఉత్తీర్ణత తగ్గిపోవడంతో..
కొవిడ్‌తో 2020-21 విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షలు నిర్వహించకుండానే నేరుగా ప్రమోట్‌ చేయడంతో ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాల సంఖ్య పెరిగింది. 2021-22లో పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ విద్యలో ప్రథమ సంవత్సరం 19.20, ద్వితీయంలో 31.78 శాతమే ఉత్తీర్ణత నమోదైంది. ఉత్తీర్ణతశాతం భారీగా పడిపోగా చాలా మంది విద్యార్థులు ప్రైవేటు కళాశాలల్లో చేరగా.. కొందరు విశాఖ, విజయవాడ, హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో చేరారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలు తగ్గడానికి ఇదీ ఒక కారణమైంది.  

 

ఆశలన్నీ వారిపైనే..
పదో తరగతి సప్లిమెంటరీ విద్యార్థులపైనే ఆశలు పెట్టుకున్నారు. జులై 6 నుంచి 15 వరకు పరీక్షలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 6,735 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయగా 4,193 మంది ఉతీర్ణులయ్యారు. ప్రైవేటులో రుసుముల భారంతో వీరంతా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చేరేందుకు మొగ్గుచూపుతున్నారని రెండు జిల్లాల వృత్తివిద్యాశాఖాధికారులు సురేష్‌కుమార్‌, మంజులవీణ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.