• facebook
  • whatsapp
  • telegram

MLHP Posts: ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల భర్తీలో ముందుకెళ్లేందుకు హైకోర్టు నిరాకరణ

ఈనాడు, అమరావతి: మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) నియామక పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని, ప్రక్రియను నిలువరిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని (స్టే వెకేట్‌) కోరుతూ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను హైకోర్టు సెప్టెంబ‌రు 5న‌ తిరస్కరించింది. విచారణను సెప్టెంబ‌రు 9న చేపడతామని పేర్కొంది. వైఎస్‌ఆర్‌ గ్రామీణ ఆరోగ్య క్లినిక్‌లు - ఆరోగ్య, వెల్‌నెస్‌ కేంద్రాల్లో 1681 మంది ఎంఎల్‌హెచ్‌పీల నియామకానికి ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాలుచేస్తూ ఒంగోలుకు చెందిన వైద్యులు శివకృష్ణ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఆయుర్వేద వైద్యులకు పోస్టుల భర్తీలో అవకాశం కల్పించకపోవడం చట్ట విరుద్ధమన్నారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం.. నియామక ప్రక్రియను నిలుపుదల చేసింది. సోమవారం విచారణలో ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సెప్టెంబ‌రు 6వ తేదీ పరీక్షకు ఏర్పాట్లు చేసుకున్నామని, స్టే ఎత్తివేసి ముందుకెళ్లేందుకు అనుమతివ్వాలని కోరారు. పరీక్ష నిర్వహణకు రూ.లక్షల్లో సొమ్ము ఖర్చు చేశామని తెలిపారు. ఆ అభ్యర్థనను పిటిషనర్‌ తరఫు న్యాయవాది జడ శ్రావణ్‌ కుమార్‌ వ్యతిరేకించారు. దీంతో స్టే ఎత్తివేతకు హైకోర్టు నిరాకరించింది.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.