ఐఐటీల్లో బీటెక్, బ్యాచులర్ ఆఫ్ సైన్స్(బీఎస్) సీట్ల భర్తీకి ఆగస్టు 28వ తేదీన నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్-2022 ఫలితాలు సెప్టెంబర్ 11న విడుదయ్యాయి. అడ్వాన్స్డ్ పరీక్షకు 1,56,089 మంది హాజరయ్యారు. సెప్టెంబర్ 12వ తేదీ నుంచి ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశానికి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(జోసా) కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. దేశంలో 23 ఐఐటీలు ఉండగా.. మొత్తం 16,598 సీట్లున్నాయి. వీటిలో బాలికలకు 1,567 సీట్లను సూపర్న్యూమరరీ కింద కేటాయిస్తారు. ఐఐటీల్లో అత్యధికంగా 2,129 మెకానికల్ ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం సీట్లలో ఇవి సుమారు 13 శాతం. అయిదేళ్ల డ్యూయల్ డిగ్రీ సీట్లనూ కలిపితే అది 14 శాతానికి పెరుగుతుంది.
వెబ్సైట్: https://result.jeeadv.ac.in/
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఏఈఈ కొలువులకు ఎలా సిద్ధం కావాలి?
‣ ఎదురుగానే జవాబు అయినా ఎంతో కష్టం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.