ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో విద్యార్థులు.. తెలంగాణలో విద్యకు చిరునామాగా హైదరాబాద్ వర్ధిల్లుతోంది. ఇందుకు తగ్గట్టుగా నగరంలో ఉపాధ్యాయుల సంఖ్య సైతం భారీగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు విభాగంలో కలిపి ప్రతి 20 మంది విద్యార్థులకు ఒకరు చొప్పున ఉపాధ్యాయులు ఉన్నారు. విద్యా అవసరాలకు తగ్గట్టుగా ఉపాధ్యాయుల సంఖ్యను కేటాయించడంలో పాఠశాలలు ముందు వరుసలో నిలిచాయి. యూడైస్-2020-21 లెక్కల ప్రకారం నగరంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్యపై స్పష్టత వచ్చింది. దీన్ని విశ్లేషించగా.. ప్రతి 19-20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడి ఆధ్వర్యంలో బోధన కొనసాగుతున్నట్లు స్పష్టమైంది. ఇందులో ప్రైవేటు పాఠశాలల్లో ఎక్కువ మంది ఉపాధ్యాయులుండగా, ప్రభుత్వ విభాగంలో ఆ సంఖ్య కొంత తక్కువగా ఉన్నట్లు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా వేధిస్తోందని, దాదాపు 3600 మంది ఉపాధ్యాయులు ఇంకా అవసరమని విశ్లేషిస్తున్నారు.
కుత్బుల్లాపూర్ టాప్
విద్యార్థుల సంఖ్యలో కొన్నేళ్లుగా కుత్బుల్లాపూర్ మండలమే ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. రాష్ట్రంలో అత్యధిక విద్యార్థుల మండలంగా గుర్తింపు తెచ్చుకుంది. శేరిలింగంపల్లి మండలంలోనూ లక్ష మందికిపైగా విద్యార్థులున్నారు. ఈ రెండు మండలాల్లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన స్థిరపడిన వారు ఎక్కువగా ఉన్నారు. భవన నిర్మాణం, పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో అక్కడ ఉంటూ పిల్లలను పాఠశాలల్లో చేరుస్తుండటంతో ఎక్కువగా ఉంటున్నారని మేడ్చల్ జిల్లా విద్యా శాఖాధికారిణి ఐ.విజయకుమారి విశ్లేషించారు. ఆంగ్ల మాధ్యమం ప్రారంభించడం, నోటు పుస్తకాలు వంటివి వితరణ చేస్తుండటంతో సర్కారు బడుల్లోనూ విద్యార్థుల సంఖ్య బాగా పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలోనే అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలోనే అత్యధికంగా మంది విద్యార్థులున్నారు. ఈ జిల్లాతోపాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో కలిపి 19.31లక్షల మంది విద్యార్థులున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 56,27,388 మంది విద్యార్థులుండగా, అందులో 34శాతం మంది ఈ మూడు జిల్లాల్లోనే ఉండటం విశేషం. దీనికి తగ్గట్టుగా వేల సంఖ్యలో పాఠశాలలు పుట్టుకొచ్చాయి.
జిల్లాల వారీగా ఉపాధ్యాయుల సంఖ్య..
హైదరాబాద్: 38,419
మేడ్చల్: 28,833
రంగారెడ్డి: 31,032
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఉజ్జ్వల భారత్ సాకారమే లక్ష్యంగా...
‣ జీవవైవిధ్యానికి గొడ్డలి పెట్టు
‣ అందరికీ అందని బ్యాంకింగ్ సేవలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.