8 ఐఐటీలకు సంచాలకులను నియమించేందుకు రాష్ట్రపతి ఆమోదం
దిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (తిరుపతి) డైరెక్టర్‌గా కేఎన్ సత్యనారాయణను నియమించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దేశంలోని మరో 7 ఐఐటీలకూ సంచాలకులను నియమించేందుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్టు కేంద్ర విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. ఐఐటీ-పాలక్కడ్‌కు శేషాద్రి శేఖర్, ఐఐటీ-భువనేశ్వర్‌కు శ్రీపాద్ కర్మల్కర్, ఐఐటీ-ధార్వాడ్‌కు వెంకయ్యప్పయ్య దేశాయ్, ఐఐటీ-గోవాకు పసుమర్తి శేషు, ఐఐటీ-భిలాయ్‌కు రాజీవ్ ప్రకాశ్, ఐఐటీ-గాంధీనగర్‌కు రజత్ మూనా, ఐఐటీ-జమ్ముకు మనోజ్సింగ్ గౌర్లను డైరెక్టర్లుగా నియమించేందుకు రాష్ట్రపతి అంగీకారం తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.