• facebook
  • whatsapp
  • telegram

Videsi Vidya: విదేశీ విద్యకు ని‘బంధనాలు’!

* పేద విద్యార్థులకు దక్కని ఊరట

* ప్రభుత్వం నిర్దేశించిన వర్సిటీల్లో చేరుతున్న వారు తక్కువ మందే

 

ఈనాడు, అమరావతి: విదేశీ విద్య సాయంలో అర్హుల సంఖ్యను తగ్గించి, డబ్బులు మిగుల్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారీగా సాయం అందిస్తున్నామంటూనే నిబంధనలతో అర్హుల జాబితాలో కోత వేస్తోంది. ఒక పక్క అన్ని దేశాల్లోనూ విశ్వవిద్యాలయాల తరగతులు ప్రారంభమై విద్యార్థులు విదేశాలకు వెళ్లిపోయినా ఇప్పటికీ దరఖాస్తుల ప్రక్రియే పూర్తి చేయలేదు.. మరోపక్క ఏపీకి చెందిన విద్యార్థులు చాలా తక్కువగా చేరే విశ్వవిద్యాలయాలనే ఎంపిక జాబితాలో పెట్టింది. దీంతో చాలామంది పేదవారు అర్హత కోల్పోతున్నారు. లబ్ధిదారుల సంఖ్య తగ్గించుకునేందుకే ప్రభుత్వం ఈ విధానం అమలు చేస్తోందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

నాణ్యత పేరుతో మొండిచేయి..

క్యూఎస్‌ ర్యాంకుల్లో మొదటి 200 విశ్వవిద్యాలయాల్లో చేరే వారికే విదేశీ విద్య పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 1 - 100 ర్యాంకుల్లోని వర్సిటీల్లో చేరే వారికి పూర్తిగా ఫీజు చెల్లిస్తామని, 101 - 200 ర్యాంకుల వాటిలో ప్రవేశాలు పొందే వారికి రూ.50లక్షలుగానీ, ఫీజులో 50శాతంగానీ.. ఏది తక్కువైతే దాన్ని ఇస్తామని వెల్లడించింది. ప్రభుత్వ నిబంధన కారణంగా చాలా మంది పేదవారికి ఈ విదేశీ విద్య సదుపాయం అందని పరిస్థితి నెలకొంది. గత 10 ఏళ్లుగా విదేశాలకు వెళ్లిన విద్యార్థులను పరిశీలిస్తే ప్రభుత్వం ప్రకటించిన 200 వర్సిటీల్లో ఏపీ వారు చేరుతున్నవి 24లోపే ఉన్నాయి. మొదటి 50 విశ్వవిద్యాలయాల్లో న్యూయార్క్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీ, యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిటిష్‌ కొలంబియా మినహా మిగతా వాటిల్లో చేరుతున్న ఏపీ విద్యార్థులు చాలా అరుదు.

 

వెళ్లేవారే లేరు..

హైదరాబాద్‌, గుంటూరు, విజయవాడ, విశాఖలో శాఖలు కలిగిన ఓ కన్సల్టెన్సీ విదేశాలకు వెయ్యి మంది విద్యార్థులను పంపిస్తే.. ఇందులో ప్రభుత్వం పేర్కొన్న 200 వర్సిటీల్లో ప్రవేశాలు పొందిన వారు 15 మందిలోపే ఉన్నారు. మొదటి 50 వర్సిటీల్లో కేవలం ఆరుగురుండగా.. 100 - 200 ర్యాంకు వాటిల్లో 9 మందికే సీట్లు వచ్చాయని కన్సల్టెన్సీ వెల్లడించింది. విజయవాడ, విశాఖపట్నంతోపాటు దేశవ్యాప్తంగా కన్సల్టెన్సీలు కలిగిన ఓ సంస్థ ఈ ఏడాదికి 3వేల మందిని విదేశీ విద్యకు పంపిస్తే ఇందులో ఏపీ నుంచి ఒకే ఒక్కరు యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీలో చేరారు. ఈ లెక్కన ప్రభుత్వ నిబంధన కారణంగా చాలా మంది పేదవారికి విదేశీ విద్య సాయం అందని పరిస్థితి నెలకొంది.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అన్ని విభాగాలకు సమ ప్రాధాన్యం!

‣ జేఈఈ స్కోరుతో బీటెక్‌ డిగ్రీ, ఆర్మీ కొలువు

‣ కొలువుల‌కు కొర‌త లేదు

‣ కాలేజీలో చేరేముందు కాస్త ప‌రిశీలించండి!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.