• facebook
  • whatsapp
  • telegram

Civil Assistant: సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ నియామక తుది జాబితా రద్దు

 

* సవరించిన జాబితాపై 26 వరకు అభ్యంతరాల స్వీకరణ

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రజారోగ్య శాఖలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (సీఏఎస్‌) పోస్టుల భర్తీకి ప్రకటించిన జాబితాను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రద్దు చేశారు. అందులో దొర్లిన తప్పులు సవరించి, మళ్లీ రివైజ్డ్‌ తుది ఎంపిక జాబితాను ప్రకటించారు. దీనిపై అభ్యర్థుల నుంచి సెప్టెంబర్‌ 26 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. ఈ పరిణామం వైద్య ఆరోగ్య శాఖలో చర్చనీయాంశంగా మారింది. సీఏఎస్‌ రిక్రూట్‌మెంట్‌ (నోటిఫికేషన్‌ నంబరు-04/ 2022) ప్రకారం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన వారి మార్కుల మెమోలో పేర్కొన్న మెయిన్‌, లాంగ్వేజి సబ్జెక్టులు, స్టడీ అవర్స్‌, మార్కులు గుర్తించి ప్రాధాన్య క్రమంలో అభ్యర్థుల జాబితా తయారీలో తప్పులు జరిగినట్లు తెలిసింది. అలాగే ఒప్పంద విధానంలో వైద్య ఆరోగ్య శాఖలోనే వివిధ యూనిట్స్‌లో పని చేసిన వారికి ప్రాధాన్య మార్కుల కేటాయింపు తీరును ప్రశ్నిస్తూ పలువురు కోర్టును ఆశ్రయించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రివైజ్డ్‌ తుది జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు అధికారులు సెప్టెంబర్‌ 24న తెలిపారు. దీనిపై ఇప్పుడు అభ్యంతరాలను తీసుకుంటారు. తొలి జాబితాలో ఎంపికైన వారే దాదాపుగా దీనిలోనూ ఉన్నారని పేర్కొన్నారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.