దిల్లీ: దేశవ్యాప్తంగా పలు ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన ‘ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (సీయూఈటీ)-పీజీ’ ఫలితాలు సెప్టెంబరు 26న విడుదలయ్యాయి. అందులో సబ్జెక్టులవారీగా అత్యుత్తమ మార్కులు సాధించినవారి పేర్లను కూడా జాతీయ పరీక్షా సంస్థ (ఎన్‌టీఏ) ప్రకటించింది. సీయూఈటీ-పీజీ కోసం మొత్తం 6.07 లక్షల మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా.. కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షను నిర్వహించిన సంగతి గమనార్హం. దేశవ్యాప్తంగా 66 కేంద్రీయ, రాష్ట్రీయ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఈ పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పించేందుకు నిర్ణయించాయి. ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఇక ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది.
https://ntaresults.nic.in/resultservices/CUET-auth-22
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.