• facebook
  • whatsapp
  • telegram

Disabled Students: దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేక టీచర్లు తప్పనిసరి

విద్యాహక్కు చట్టానికి కేంద్రం సవరణ
ఈనాడు, దిల్లీ: ఇకపై ప్రతి పాఠశాలలో దివ్యాంగ విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక టీచర్‌ ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఈ మేరకు విద్యాహక్కు చట్టం-2009కి సవరణలు చేస్తూ సెప్టెంబరు 27న నోటిఫికేషన్‌ జారీచేసింది. 1 నుంచి 5వ తరగతి వరకు ప్రతి 10 మంది దివ్యాంగుల కోసం, 6 నుంచి 8వ తరగతికి అయితే ప్రతి 15 మంది కోసం ఒక ప్రత్యేక టీచర్‌ ఉండాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఈ సంఖ్య ప్రకారం ప్రత్యేక టీచర్లు దొరక్కపోయినప్పుడు, ఏకోపాధ్యాయులతో పాఠశాలలు నడుస్తున్నప్పుడు కొన్ని పాఠశాలల్ని క్లస్టర్‌గా గుర్తించి అందులో ఉన్న దివ్యాంగుల పిల్లల నిష్పత్తికి సరిపోయేలా ప్రత్యేక ఉపధ్యాయుల్ని నియమించాలని స్పష్టంచేసింది. అయితే ఈ క్లస్టర్‌లో స్కూళ్ల సంఖ్య 4కి మించకూడదని, అలాగే వాటి మధ్య దూరం 5 కిలోమీటర్లు దాటకూడదని షరతు విధించింది.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.