విద్యార్థులకు తాము చదివే సబ్జెక్టులపైనే కాకుండా ఆర్థిక అంశాలపైనా అవగాహన ఉండాలని భావించిన ‘మ్యువిన్’ సంస్థ... దేశవ్యాప్తంగా ఇంటర్ వరకూ చదివే విద్యార్థుల కోసం ‘ఫిన్మానియా’ పేరుతో ఫైనాన్షియల్ ఒలింపియాడ్ నిర్వహిస్తోంది. మింట్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లతో సమష్టిగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. విద్యార్థులకు ఆర్థిక భద్రత, బీమా, మనీ మేనేజ్మెంట్లాంటి అంశాలపై అవగాహన తీసుకురావడం, సొంతంగా ఆలోచించేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. పెట్టుబడి, పొదుపు, రుణం... లాంటి అనేక విషయాలను ఈ ఒలింపియాడ్ ద్వారా చర్చించనున్నారు.
‣ ఇందులో పాల్గొనేందుకు అక్టోబర్ 14వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం ఆఫ్‌లైన్‌లో జరుగుతుండగా, మిగతా చోట్ల ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు.
‣ ఇందులో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు అడుగుతారు. జోనల్, నేషనల్ స్థాయిలో విజేతలను ప్రకటించి రూ.10 లక్షల వరకూ విలువైన బహుమతులు అందజేస్తారు.
దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్సైట్: https://finmania.muvin.in/
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 1,00,000 స్కాలర్షిప్లు
‣ ఏఐ - ఎంఎల్ ఎందుకు నేర్చుకోవాలి?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.