ఈనాడు, అమరావతి: నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా నాలుగేళ్ల డిగ్రీలో విద్యార్థి ఎప్పుడైనా చదువు ఆపేసి, బయటకు వెళ్లిపోయే అవకాశాన్ని కల్పించేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ఉన్నత విద్యలో ప్రవేశాలను పెంచేందుకు ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేసిన తర్వాత చదువు ఆపేసి, వెళ్లిపోవాలను కుంటే విద్యార్థి వెళ్లిపోవచ్చు. ఏడాది చదివినందుకు కొన్ని క్రెడిట్లు ఇచ్చి సర్టిఫికెట్ ప్రధానం చేస్తారు. ఒకవేళ మళ్లీ వచ్చి డిగ్రీ చదువుకోవచ్చు. లేదంటే ఈ క్రెడిట్లను బదిలీ చేసుకొని, డిప్లొమా గాని, ఇతర కోర్సులు పూర్తి చేసుకోవచ్చు. డిగ్రీ రెండో సంవత్సరం పూర్తయిన తర్వాత మానేస్తే డిప్లొమా ఇస్తారు. మూడేళ్ల తర్వాత వెళ్లిపోతే డిగ్రీ, ఆ తర్వాత ఆనర్స్ డిగ్రీ ప్రదానం చేస్తారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్న పాఠ్యప్రణాళికలోనూ కొన్ని మార్పులు చేయనున్నారు. దీన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకురావాలనే దానిపై ఇంతవరకు స్పష్టత రాలేదు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ క్లిష్ట సమయాల్లోనూ ఉద్యోగ సాధన ఎలా?
‣ ఒక్క ఛాన్స్ కాదు... అనేక ఛాన్సులు!
‣ కోర్సు పూర్తి కాగానే కొలువుల్లోకి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.