• facebook
  • whatsapp
  • telegram

Agricet: టీఎస్‌ అగ్రిసెట్‌-2022 ఫలితాల విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌ అగ్రిసెట్‌-2022 ఫలితాలను ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి రఘునందన్‌రావు అక్టోబర్‌ 22న విడుదల చేశారు. ఈ పరీక్షను రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో సెప్టెంబర్‌ 30న నిర్వహించారు. వ్యవసాయ డిప్లొమాలో 940 మంది, డిప్లొమా ఇన్‌ సీడ్‌ టెక్నాలజీలో 95 మంది, డిప్లొమా ఇన్‌ ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌లో 62 మంది, డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణులు 47 మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ ఫలితాలను వర్సిటీ వెబ్‌సైట్‌లో ఉంచారు. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా వ్యవసాయ డిగ్రీ కోర్సులో సీట్లు కేటాయిస్తారు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.