మాచవరం, న్యూస్టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో నైపుణ్య కళాశాల ఏర్పాటుకు ఆమోదించింది. ఇందులో భాగంగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ), ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రంలోనే తొలి నైపుణ్య కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి.నరేష్ తెలిపారు. ప్రొడక్షన్ డిజైన్ ఇంజినీర్ మెకానికల్ (బీఈ/బీటెక్ ఇన్ మెకానికల్, ఆటో మొబైల్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్), ఆటోమోటివ్ ఆడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజినీర్ (బీఈ/బీటెక్ ఇన్ మెకానికల్, ఆటో మొబైల్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్) కోర్సులో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. కోర్సు కాలం 500 గంటలు కాగా.. ఒక్కో కోర్సులో 30 సీట్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ శిక్షణ కాలంలో ఉచితంగా వసతి, భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. శిక్షణ అనంతరం ప్రముఖ సంస్థల్లో ఉద్యోగావకాశాలు చూపిస్తామని పేర్కొన్నారు. ఆసక్తిగల నిరుద్యోగ యువత అక్టోబరు 26వ తేదీలోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలని, 28వ తేదీన ప్రీ అసెస్మెంట్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 80749 79938, 77319 82861 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ అంతర్గత ప్రజాస్వామ్యం ఎండమావి
‣ కొత్త డిగ్రీలు ఎన్నో అవకాశాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.