ఈనాడు, అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ ఏడాది 207 పీజీ సీట్లు పెరిగాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్రంలో 2019 వరకు వైద్య విద్య పీజీ సీట్లు 970 కాగా.. ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా మూడున్నరేళ్లల్లో మరో 953 సీట్లు పెరిగాయని పేర్కొంది. పీజీ సీట్లు దాదాపుగా రెట్టింపయ్యాయని, దీంతో వైద్య నిపుణుల సంఖ్య పెరుగుతుందని వెల్లడించింది. ‘రాష్ట్ర వ్యాప్తంగా వైద్య బోధన సిబ్బందిని నియమిస్తున్నాం. 1,254 సహాయ ఆచార్యులను నియమించాం. 106 ఆచార్యులు, 312 అసోసియేట్ ఆచార్యులు, 832 సహాయ ఆచార్యుల పోస్టులను సృష్టించాం. దీంతో పీజీ సీట్ల పెరుగుదలకు మార్గం ఏర్పడింది. రాష్ట్రంలో మరో 17 వైద్య కళాశాలలు పూర్తయితే సుమారు 3వేల పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది’ అని ప్రభుత్వం వెల్లడించింది.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఈఆర్పీలో తిరుగులేని ఎస్ఏపీ!
‣ విద్యార్థినుల సాంకేతిక విద్యకు ఆర్థికసాయం!
‣ పీజీ విద్యార్థినులకు యూజీసీ ప్రోత్సాహం
‣ డిజిటల్ అక్షరాస్యత... మీకుందా?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.