• facebook
  • whatsapp
  • telegram

Law College Fees: న్యాయ కళాశాలల్లో పరీక్ష ఫీజుల పేరుతో అదనంగా వసూళ్లు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని కొన్ని న్యాయ విద్య కళాశాలలు పరీక్ష ఫీజుల రూపంలో ఒక్కొక్కరి నుంచి రూ.4వేలు చొప్పున వసూలు చేస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఆదేశాల ప్రకారం ట్యూషన్‌ ఫీజును మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా.. అదనంగా పరీక్ష ఫీజులు చెల్లించాలని కళాశాలలు అడుగుతున్నాయని వెల్లడించారు. దీనిపై వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి ఫిర్యాదు చేయగా.. ఇది తమ పరిధి కాదంటూ సమాధానమిచ్చిందని, ఉన్నత విద్య కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఇంతవరకు తమకు ఎలాంటి సమాధానం రాలేదని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పీజీ కళాశాలలకు కమిషన్‌ ఫీజులను నిర్ణయిస్తుంది. ఇందులోనే అన్ని రకాల ఫీజులు కలిపి ఉంటాయి. అదనంగా ఎలాంటి రుసుములు తీసుకోకూడదనే ఆదేశాలు ఉన్నాయి.  అయినా... కొన్ని కళాశాలలు పరీక్ష, ఇతరత్రా ఫీజులను వసూలు చేస్తున్నాయి.

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-11-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.